ఐటెం సాంగ్‌కు నిఖిత సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హాయ్’ అంటూ పలకరించి ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ నిఖిత ఆ తర్వాత డజనుకు పైగా తెలుగు సినిమాలతోపాటు.. అంతకుమించిన సంఖ్యలోనే కన్నడ..తమిళ్.. మలయాళ సినిమాల్లో నటించింది. చాలాకాలంగా సౌత్‌లో హీరోయిన్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తున్న ఈ భామకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయ్ కానీ.. అవేవీ కెరీర్‌కి బ్రేక్‌ఇచ్చే రేంజ్‌వి కావు. అందుకే తన కెరీర్‌కి తనే టర్నింగ్ ఇచ్చుకోవాలని డిసైడ్ అయిపోయింది నిఖిత. టాలీవుడ్‌లో హోలీ కేరక్టర్లనే ఎక్కువగా చేసింది కానీ.. ఇప్పుడు ఓ ఐటెం సాంగ్‌తో పలకరించేందుకు రెడీ అయిపోయింది. ‘శరభ’ అనే టైటిల్‌పై రూపొందుతున్న సినిమాలో ఐటెం గాళ్‌గా నటిస్తోంది నిఖిత. ఈ చిత్రంలో జయప్రద కీలక పాత్రలో నటిస్తుండగా ఆకాష్ సహదేవ్.. మిస్ర్తి చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నిఖిత ఇలా స్టార్ హీరో సినిమాలో కాకుండా సాధారణ హీరో సినిమాలో ఐటెంసాంగ్‌లో నటించేందుకు ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.