చిన్ని చిన్ని ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్, గట్టు మను, సోనియా, దీప్తి హీరో హీరోయిన్లుగా సంతోష్ నేలంటి దర్శకత్వంలో పి.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై సోని పవన్, గట్టు రజని నిర్మిస్తున్న చిత్రం ‘చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే’. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ దర్శకులు సాగర్, నిర్మాతలు మల్కాపురం శివకుమార్, ప్రతాని రామకృష్ణగౌడ్, రామసత్యనారాయణ, శివాజీ రాజా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ, మంచి సినిమాలను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని,ట్రైలర్ బాగుందని అన్నారు. దర్శకుడు సాగర్ మాట్లాడుతూ, రొటీన్‌గా కాకుండా భిన్నంగా వున్న సినిమా ఇదని, ఇప్పుడు భిన్నమైన చిత్రాలన్నీ బాగా ఆడుతున్నాయని, ఇందులో పాటలు కూడా బావున్నాయని, తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని అన్నారు. హీరోయిన్ సోనియా మాట్లాడుతూ, ఇందులో నటించడమే కాకుండా ఓ పాట కూడా పాడానని, ఇకపై అవకాశం వస్తే పాడటానికి సిద్ధమేనని అన్నారు. దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ, యువతకు కావాల్సిన అన్ని రకాల అంశాలు ఉన్న ఈ సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ, మా అబ్బాయికి సినిమాలమీద ఇంట్రెస్ట్ కలగడంతో నిర్మాతగా మారానని, ఈ యూనిట్ చేసిన ప్రయత్నం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హీరో మాట్లాడుతూ, పాటలకు మంచి స్పందన వచ్చిందని, ముఖ్యంగా యూట్యూబ్‌లో చాలా లైక్‌లు వచ్చాయని, మంచి కానె్సప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఇది అన్నారు.

చిత్రం.. సోనియా