రాజకీయాలపై డర్టీగేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిర్డీ సాయి క్రియేషన్స్ పతాకంపై ఖయ్యూం, నందినీకపూర్ జంటగా అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌కుమార్ రూపొందిస్తున్న పొలిటికల్ క్రైమ్ చిత్రం ‘డర్టీగేమ్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ, మహాభారతంలో సాగే రాజకీయం ఎలా వుంటుందో నేటి రాజకీయం కూడా అంతే స్థాయిలో సాగుతోందని ఈ చిత్రంలో చెబుతున్నామని, ముఖ్యంగా మయసభ సన్నివేశ చిత్రీకరణ ఈ చిత్రానికి హైలెట్‌గా వుంటుందని, రాజకీయంలో తనా పరా భేదాలు లేకుండా విజయం కోసం అందరూ పోరాడతారని, ఇదే పాయింట్‌ను తీసుకొని ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. పక్కా ప్లానింగ్‌తో అతి తక్కువ టైమ్‌లో టాకీపార్ట్ పూర్తిచేశామని, వినాయకచవితి తరువాత పాటల చిత్రీకరణ జరుపుతామని, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాత తెలిపారు. పరుచూరి గోపాలకృష్ణ, సురేష్, అస్మిత, రమ్య, మనోహర్ నాయుడు, జబర్దస్త్ బృందం నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:సునీల్ కశ్యప్, నిర్మాత:తాడి మనోహర్ నాయుడు, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ.