పాటల నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాలక్ష్మి మూవీస్ పతాకంపై మగేష్, సవ్యసాచి, కారుణ్య, సనశాలిని ప్రధాన తారాగణంగా అవన్ ఆళ్ల దర్శకత్వంలో తెలుగు, తమిళ, ఒరియా భాషల్లో దాడి అప్పలనాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘నీరాజనం’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను వి.సాగర్, బిగ్ సీడీని రాజ్ కందుకూరి, ఆడియో సీడీని మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ, మంచి ప్లానింగ్‌తో మూడు భాషల్లో రూపొందిన ఈ చిత్రం విజయవంతం అవ్వాలని కోరుకున్నారు. సవ్యసాచి ఒరియాలో స్టార్ హీరోగా ఎదిగితే, ‘షాపింగ్‌మాల్’ చిత్రంలో కథానాయకుడిగా పరిచమైన మగేష్ ఈ చిత్రంలో హీరోలుగా నటించారని తెలిపారు. మ్యూజికల్ రియాలిటీ షో నేపథ్యంలో సాగే ముక్కోణ ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్ర కథను మూడేళ్ల క్రిందే రాసుకున్నానని, తనపై నమ్మకంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతకు ధన్యవాదాలని దర్శకుడు తెలిపారు. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా సాగే ఈ చిత్రాన్ని ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మిస్తున్నామని, అనుకున్న కథను సమర్థంగా తెరపైకి ఆవిష్కరించే దర్శకుడు ఉండాలని, ఈ చిత్రానికి అవన్‌ను తీసుకున్నామని నిర్మాత తెలిపారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు రవిశంకర్, మగేష్, సవ్యసాచి, కారుణ్య, సనషాలిని, బన్నీ ప్రకాష్, మహిశేర్ల, పి.తిలక్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.