గ్యారేజ్‌తో హ్యాట్రిక్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విడుదలైన రోజునుండీ ప్రతి థియేటర్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా హైట్స్‌కు చేరుకుంటుందన్న నమ్మకం ఉంది. సినిమా విజయవంతమవడానికి కంటెంటే ప్రధానమైన అంశమని ప్రతిఒక్కరూ చెబుతున్నారు’ అని చిత్ర దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఎన్టీఆర్, సమంత, కాజల్, మోహన్‌లాల్ ప్రధాన తారాగణంగా మైత్రీ మూవీస్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్, రవిశంకర్, సి.వి.మోహన్ రూపొందించిన ‘జనతా గ్యారేజ్’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, ప్రేక్షకులనుండే కాకుండా పరిశ్రమ నుండి మంచి సినిమా అన్న కాంప్లిమెంట్లు వస్తున్నాయని, తన కెరీర్‌లోనే ఈ చిత్రం ద్వారా అభినందనలు అందుకున్నానని తెలిపారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తన జీవితంలో విలువైన, సంతోషకరమైన విజయాన్ని అందించిందని, హ్యాట్రిక్ మూవీగా నిలిచిందని అన్నారు. ఇంకా మంచి సినిమాలు తీయడానికి ఈ సినిమా తన బాధ్యతను పెంచిందని, మోహన్‌లాల్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలను హాండిల్ చేయగలమా అని మొదట అనుకున్నామని, అది ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇవ్వడం ఆనందాన్నిస్తోందని తెలిపారు. ప్రతిరోజూ మన చుట్టూ జరుగుతున్న అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ చిత్రాన్ని అభిమానులు ఆదరిస్తున్నారని, మహిళలు, యువత ఇలాంటి సినిమాలు మరిన్ని కావాలని అడగటం సంతోషదాయకమని ఆయన అన్నారు. సినిమా అన్ని కేంద్రాలలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందని, రికార్డు కలెక్షన్లు వచ్చాయని నిర్మాత ఎలమంచిలి రవిశంకర్ తెలిపారు.