లఘు చిత్రాల పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వున్న అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస అవసరాలు కూడా లేవు. అందువల్ల కార్పొరేట్ స్కూల్స్‌తో పోటీపడలేకపోతున్నాయి. ప్రాజెక్టు 511 ద్వారా అలాంటి పాఠశాలలకు మంచి సదుపాయాలను అందించి నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం జరిగింది. హైదరాబాద్ రంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లోని 1022 పాఠశాలల్లో కనీస అవసరాలను తీర్చామని, అలాగే ఇంకా సదుపాయాలు లేని పాఠశాలల కోసం ప్రయత్నం చేస్తున్నామని, ఇందుకోసమే పది నిమిషాల వ్యవధిలో లఘు చిత్రాల పోటీ నిర్వహిస్తున్నామని రౌండ్ టేబుల్ 8 సంస్థ తెలిపింది. ఈ కార్యక్రమం కోసం ఈనెల 20 వరకు తమ లఘు చిత్రాలను పోటీకి పంపాలని వారు కోరారు. అక్టోబర్ 9న లఘు చిత్రాలను జెఆర్‌సి కనె్వన్షన్ సెంటర్‌లో ప్రదర్శిస్తారని, ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతారని, ఇందుకు ఏ ఫీజూ, భాషాభేదం లేదని, మొదటి విజేతకు 50వేలు, రెండవ విజేతకు 15వేలు అందిస్తారని ఆ సంస్థ తెలిపింది.