రజనీ సరసన చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించాలని ఏ హీరోయిన్ అనుకోదు చెప్పండి! ఇలాంటి అవకాశాల కోసం అందాల భామలు గట్టి ప్రయత్నాలే చేస్తుంటారు. కానీ ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఈ క్రేజీ అవకాశాన్ని కొట్టేసింది అందాల భామ అమలాపాల్. ఈమధ్యే భర్తతో విడిపోయిన అమలాపాల్, ఇప్పుడు వరుసగా సినిమాల్లో బిజీ అయ్యేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈమధ్య ఈమెకు కోలీవుడ్‌లో అవకాశాలు రాకుండా చేస్తున్నారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే తాజాగా రజనీకాంత్ హీరోగా నటించే సినిమాలో అమలాపాల్ హీరోయిన్‌గా ఎంపికైంది ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కబాలితో సంచలనం క్రియేట్ చేసిన పా.రంజిత్ దర్శకత్వం వహిస్తాడని తెలిసింది. కబాలి తరువాత మళ్లీ అదే దర్శకుడితో రజనీకాంత్ సినిమా చేయడం విశేషం. అమలాపాల్ సినిమాతోపాటు తెలుగులో కూడా ప్రయత్నాలు సాగిస్తోందట. మొత్తానికి తక్కువ సమయంలోనే రజనీ సరసన ఛాన్స్ కొట్టేసిందని అంటున్నాయి సినీ వర్గాలు.

చిత్రం..అమలాపాల్