సిద్ధమైన త్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన తారలతో గౌతంనాయుడు దర్శకత్వంలో పద్మజానాయుడు రూపొందించిన చిత్రం ‘త్రయం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, పెద్ద చిత్రాలకు దీటుగా ఈ చిత్రాన్ని రూపొందించామని, ఎలాంటి హైప్ లేకుండా ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోందని, సినిమాకు సంబంధించిన హిందీ రైట్స్‌ను ఓ ప్రముఖ సంస్థ మంచి రేట్‌తో సొంతం చేసుకోవడం తమకు గర్వకారణంగా ఉందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలలోనే ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.వి.హెచ్, కెమెరా: శివారెడ్డి, ఎడిటింగ్: రామారావు జె.పి, దర్శకత్వం: గౌతంనాయుడు.