మళ్లీ.. అష్టాచమ్మా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పట్లో వచ్చిన అష్టాచమ్మా సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు నాని. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న నాని, ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో హీరోగా సెటిలయ్యాడు. ఇటీవలే భలేభలే మగాడివోయ్ హిట్టుతో మంచి ఊపుమీదున్న నాని, తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అవకాశాలు ఇంటిముందు క్యూ కడుతున్నా -తనను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే వీరిమధ్య చర్చలు జరిగాయంటున్నారు. వచ్చే నెలలో సినిమా సెట్స్‌పైకి రానుంది. అన్నట్టు ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కూడా మరో ముఖ్య పాత్రలో కనిపిస్తాడట. అంటే -అష్టాచమ్మా ఆడేందుకు మరోసారి వీళ్లంతా కాంబో కట్టారన్నమాట.