సినిమాలతోపాటు సీరియల్సూ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో పాపులరైన అవికాగోర్ ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా తరువాత హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుని వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా అవికాగోర్, సంతోష్ జంటగా పి.రామ్మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తను నేను’. ఈ చిత్రం రేపు విడుదలవుతున్న సందర్భంగా అవికాగోర్ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లో...
మెచ్యూర్డ్ గాళ్
ఈ చిత్రంలో కీర్తి అనే పాత్ర పోషించాను. తను చాలా మెచ్యూర్డ్ గాళ్. అలాగే సెన్సిబుల్, సెన్సిటివ్ పర్సన్. తన ఫ్యామిలీ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఈ సినిమాలో కీర్తి పాత్ర కాలేజీ గోయింగ్ గాళ్ కాదు. ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్ర చేయలేదు. ఇది నా నిజ జీవితానికి చాలా తేడాలున్నాయి. నిజానికి నేను అంత మెచ్యూర్డ్ పర్సన్‌ని కాదు.
ఆయన చాలా రెస్పాన్సిబుల్
రామ్మోహన్‌గారు ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో నన్ను హీరోయిన్‌గా పరిచయం చేశారు. అప్పుడాయన ప్రొడ్యూసర్ కాబట్టి చాలా గంభీరంగా సెట్‌లో కన్పించేవారు. కానీ ఇప్పుడు ఆయన దర్శకుడు కాబట్టి చాలా సరదాగా ఉన్నాడు. షూటింగ్‌లో చాలా ఫన్ ఉండేది. ఆయన చాలా రెస్పాన్స్‌బుల్ పర్సన్.
సింగిల్ లైన్‌లో చెప్పారు
ఈ కథను రామ్మోహన్ సింగిల్ లైన్‌లో చెప్పారు. హీరో నిన్ను ప్రేమిస్తుంటాడు. దాన్ని ఎలా చెప్పాలా అని సతమతమవుతుంటాడు. అదే కథ అని చెప్పారు.
హైలెట్స్
ఈ సినిమాలో కథ చాలా కొత్తగా వుంటుంది. మన పక్కింట్లో జరిగినట్టే అనిపిస్తుంది. అలాగే, మ్యూజిక్ కూడా బాగుంది. దాంతోపాటు ఫొటోగ్రఫి, డైరెక్షన్ అన్నీ బాగా కుదిరాయి.
తదుపరి చిత్రాలు
తెలుగులో త్వరలో మంచి ప్రాజెక్టులో నటిస్తాను. దాని గురించి త్వరలోనే తెలియజేస్తా. మరోవైపు సినిమాలు చేస్తూనే సీరియల్స్ కూడా చేస్తా అంటూ ముగించారు.

-శ్రీ