రియలిస్టిక్ చిత్రంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బిచ్చగాడు’ చిత్రాన్ని అందించిన నిర్మాతలు తాజాగా మలయాళంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ ప తాకంపై అందిస్తున్న ఈ చిత్రంలో బేబి సారాఅర్జున్ (నాన్న ఫేమ్) ప్రధాన పాత్రలో నటించడం విశేషం. మలయాళంలో విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండి ప్రశంసలు లభించాయని, ఓ చిన్నారి చేసిన సాహసం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? అనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఓ సింపుల్ కథనాన్ని రియలిస్టిక్ పంధాలో ఆవిష్కరిస్తూ స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో ఆద్యంతం రక్తికట్టేలా రూపొందించిన ఈ చిత్రానికి మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారని తెలిపారు. దుల్కర్ సల్మాన్ అతిథిగా నటించిన ఈ చిత్రాన్ని త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేస్తామని తెలిపారు. త్వరలో పేరును కూడా ప్రకటిస్తామని, బిచ్చగాడు ఎంత విజయం సాధించిందో అంతకన్నా ఈ చిత్రం విజయవంతవౌతుందన్న నమ్మకం వుందని వారు తెలిపారు.