ప్రణయం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై దిలీప్, పూనమ్‌కౌర్, అక్షిత ప్రధాన తారాగణంగా జి.ఎస్.వి.సత్యప్రసాద్ దర్శకత్వంలో ఎ,నరేందర్, విజయానంద్, సురేష్‌గౌడ్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రణయం’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా నటుడు రఘుబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ, దర్శకుడు మంచి కథతో రావడంతో ఈ చిత్రానిన రూపొందించడానికి ముందుకు వచ్చామని, దిలీప్ అనే కొత్త హీరోని పరిచయం చేస్తున్నామని, వినాయకచవితి అనంతరం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఒకే షెడ్యూల్‌లో సినిమా అంతా పూర్తిచేస్తామని, ఓ అందమైన కథనానికి అద్భుతమైన దృశ్యకావ్యాన్ని రూపొందించే ప్రయత్నంలో సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందే ఈ చిత్రంలో సంగీతం హైలెట్‌గా ఉంటుందని, ప్రేమకథలను ఓ సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే ఈ చిత్రం యువతతోపాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చుతుందన్న ఆశాభావాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హీరోహీరోయిన్లు చిత్ర విశేషాలను తెలిపారు.