సిద్ధార్థ పేరంటే ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాగర్, రాగిణి నంద్వానీ, సాక్షిచౌదరి ప్రధాన తారాగణంగా రామదూత క్రియేషన్స్ పతాకంపై కె.వి.దయానందరెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ రూపొందించిన చిత్రం సిద్ధార్థ. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ, తనకు సిద్ధార్థ అనే పేరు చాలా ఇష్టమైనదని, విజయవాడలో అదే పేరుతో ఉన్న కాలేజీలో చదువుకున్నప్పుడే జీవితం గురించి తెలుసుకున్నానని, కథానాయకుడుగా నటించిన సాగర్ హీరోగా బాగున్నాడని, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందించిన ఈ చిత్రం తప్పక విజయవంతవౌతుందని అన్నారు. కెమెరామెన్ ఈ సినిమాలో అద్భుతంగా ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించారని, మొగలిరేకులు సీరియల్‌తో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లో తెలిసిన హీరో సాగర్ బాడీ లాంగ్వేజ్‌కు తగిన విధంగా ఈ చిత్రాన్ని రూపొందించామని నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ అన్నారు. రీరికార్డింగ్ హైలెట్‌గా సాగే ఈ చిత్రంతో హీరోగా సాగర్ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటాడని దర్శకుడు దయానందరెడ్డి అన్నారు. ‘మనసంతానువ్వే’ చిత్రంలో తాను తొలిసారిగా నటించానని, ఈ చిత్రంతో మరింత పేరు వస్తుందని హీరో సాగర్ తెలిపారు. కార్యక్రమంలో రచయిత విసు, మల్టీడైమెన్షన్ వాసు, బి.గోపాల్,
దర్శకుడు బాబి, హవీష్, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. పూజ, కోట శ్రీనివాసరావు, అజయ్, సుబ్బరాజు, సత్యం రాజేష్, తా.రమేష్, ప్రభాస్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, సంగీతం: మణిశర్మ, మాటలు: పరుచూరి బ్రదర్స్, నిర్మాత: దాసరి కిరణ్‌కుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.దయానందరెడ్డి.

చిత్రం .. సాగర్, సాక్షిచౌదరి