ఎక్కడికి పోతావు చినవాడా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్ కథానాయకుడిగా ఐ.వి.ఆనంద్ దర్శకత్వంలో మేఘన ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘ఎక్కడికి పోతావు చినవాడా’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చిక్‌మంగళూరులో చివరి షెడ్యూల్ జరుపుతున్నారు. ఈనెల 12కి షూటింగ్‌పూర్తికానుంది. అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ఓ వైవిధ్యమైన కథతో రూపొందిస్తున్న ఈ చిత్రం కమర్షియల్‌గా హిట్ రేంజ్‌కి చేరుకుందని, ఫస్ట్‌లుక్ నిఖిల్ జన్మదినోత్సవం సందర్భంగా విడుదల చేశామని, దీనికి పరిశ్రమనుండి కాక ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభించిందని అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, ఆడియోను త్వరలో విడుదల చేస్తామని, అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నామని అన్నారు. హెబాపటేల్, నందితాశే్వత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో వెనె్నల కిషోర్, తనికెళ్లభరణి, సత్య, తా.రమేష్, జోష్ రవి, వైవా హర్ష, సుదర్శన్, భద్రం, అపూర్వా శ్రీనివాస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, శ్రీమణి, ఎడిటింగ్:చోటా కె ప్రసాద్, సంగీతం:శేఖర్ చందర్, మాటలు:అబ్బూరి రవి, కెమెరా:సాయిశ్రీరామ్, నిర్మాత:మేఘనా ఆర్ట్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.ఐ.ఆనంద్.