కల్యాణం కాదు నినే్న పెళ్లాడతా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున హీరోగా వచ్చిన ‘నినే్న పెళ్ళాడతా’ సినిమా అప్పట్లో సంచలన విజయం క్రియేట్ చేసి బాక్స్‌ఆఫీసును రఫ్ ఆడించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టైటిల్ ఇప్పుడు రిపీట్ కానుంది? ఆ వివరాల్లోకి వెళితే.. అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘ప్రేమమ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ఇక దసరాకు సినిమా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తరువాత చైతు హీరోగా నటించే చిత్రం ఇప్పటికే అన్ని ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు చేసుకుని రెడీగా ఉంది. ఈనెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయన’ ఫేమ్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు ముందు ‘కళ్యాణం’ అనే పేరు పెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పేరును ‘నినే్న పెళ్ళాడతా’గా మార్చే ఆలోచనలో ఉన్నారు దర్శక, నిర్మాతలు. ఇది కూడా రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ అని తెలిసింది. మొత్తానికి నాగార్జున సూపర్ హిట్ టైటిల్‌ని చైతు సొంతం చేసుకోబోతున్నాడు.