సంక్రాంతి రేసులో ఓం నమో వేంకటేశాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున హీరోగా ‘ఓం నమో వేంకటేశాయ’ పేరుతో ఓ భక్తిరస చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నాగార్జునతో కలిసి ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీసాయి’లాంటి భక్తిరస చిత్రాలను అందించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే సగభాగం పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా అక్టోబర్‌కల్లా మొత్తం పూర్తవుతుందని, సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచన చేస్తున్నామని నాగార్జున తెలిపారు. దీంతో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’, నందమూరి నటసింహం బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాలతోపాటు మరో స్టార్ హీరో అయిన నాగార్జున సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’ జత చేరనుండడం ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు. ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఊపిరి’ సినిమాలతో ఈతరం ప్రేక్షకుల్లో తనదైన స్థానం సంపాదించుకున్న నాగార్జున, ‘ఓం నమో వేంకటేశాయ’, ఆ స్థాయిని మరింత పెంచేదిగా నిలుస్తుందని చెబుతూ వస్తున్నారు. మహేష్‌రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యాజైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.