దర్శకుడిగా ధనుష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోలుగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుని మరోవైపు దర్శకులుగా ప్రూవ్ చేసుకున్న హీరోలు చాలా అరుదని చెప్పొచ్చు. ఇప్పుడు అదే కోవలో మరో తమిళ స్టార్ హీరో దర్శకుడిగా మారడానికి రెడీ అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే.. జాతీయ అవార్డు అందుకున్న నటుడు ధనుష్ కోలీవుడ్‌లో బిగ్ స్టార్. ఇప్పటికే అటు బాలీవుడ్‌లో కూడా నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం హీరోగా చేస్తున్న ధనుష్, నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఓ ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించి వరుసగా సినిమాలు తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అందులో మొదటి ప్రయత్నంగా రజనికాంత్ హీరోగా ‘కబాలి’తో సంచలనం రేపిన పా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. అలాగే ఓ సినిమాకు దర్శకత్వం కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇటీవలే ఓ కథ బాగా నచ్చి దాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట. సో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నట్టు త్వరలో ప్రకటన చేస్తాడని కోలీవుడ్ టాక్.