పూరితో కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జనతా గ్యారేజ్’ విజయంతో మంచి ఊపుమీదున్నాడు ఎన్టీఆర్. వరుస పరాజయాల తరువాత ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, జనతా గ్యారేజ్’తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఈ సక్సెస్‌ని కంటిన్యూ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఇప్పటికే రచయిత వక్కంతం వంశీతో సినిమా చేయాలని ప్లాన్ చేసాడు. కానీ వంశీ చెప్పిన కథ నచ్చకపోవడమో, లేక వంశీకి దర్శకుడిగా అనుభవం లేకపోవడంతో ఈ సినిమా చెయొద్దనే ఆలోచనలో ఉన్నాడు ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్టీఆర్ దర్శకుడు పూరి జగన్నాథ్‌తో చర్చలు జరిపాడని, కథ కూడా ఎన్టీఆర్‌కు నచ్చి ఓకే చెప్పినట్టు తెలిసింది. పూరి ప్రస్తుతం కల్యాణ్‌రామ్‌తో ‘ఇజం’ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తికావొచ్చింది. ఈనెల వరకు మొత్తం షూటింగ్ పూర్తిఅవుతుంది కాబట్టి అక్టోబర్ లేదా నవంబర్‌లో పూరి సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.