చరణ్‌తో చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో తక్కువ సినిమాలతో హీరోయిన్‌గా ముఖ్యంగా నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది అందాల భామ నిత్యామీనన్. ఇప్పటికే ఈమె చేసిన సినిమాల్లో నటిగా మంచి మార్కులే తెచ్చుకుంది. లేటెస్ట్‌గా ‘జనతా గ్యారేజ్’ సినిమాలో కూడా నిత్యాకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో ఈమెకు క్రేజీ అవకాశాలు వస్తున్నాయి. ఈ కోవలో మెగా హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. రామ్‌చరణ్ ప్రస్తుతం ‘ధ్రువ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈనెలతో పూర్తికావొచ్చింది. ఇక ఈ సినిమా తరువాత చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడు. చరణ్ తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తికావొచ్చింది. అక్టోబర్‌లో మొదలయ్యే ఈ సినిమాలో హీరోయిన్‌గా నిత్యాను ఓకే చేశారు. ఇందులో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండడంతో నిత్యాని ఎంపిక చేశారట! మరి మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిందంటే.. ఇక వరసగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలో అవకాశం దక్కినట్టే?