జాగ్వార్ స్పీడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్‌కుమార్ కథానాయకుడిగా చెన్నాంబికా ఫిలింస్ పతాకంపై ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనితా కుమారస్వామి రూపొందిస్తున్న చిత్రం ‘జాగ్వార్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి దసరా కానుకగా అక్టోబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 75 కోట్ల భారీ బడ్జెట్‌తో ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుపుతున్నామని, తమన్నా స్పెషల్ సాంగ్ ఈ చిత్రంలో హైలెట్‌గా వుంటుందని తెలిపారు. అన్ని పాటలు ప్రేక్షకులకు నచ్చుతాయని, ఆడియోను ఈనెల 18న విడుదల చేసి దసరాకు థియేటర్లకు రానున్నామని తెలిపారు. జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్, ఆదిత్యామీనన్, అవినాష్, వినాయక్‌జోషి, ప్రశాంత్, సుప్రీత్, రమ్యకృష్ణ, రావురమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:మనోజ్ పరమహంస, సంగీతం:తమన్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఎ.మహదేవ్.