అంజలి గోలీసోడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ.ఆర్.మురుగదాస్ సోదరుడు దిలీపన్, అంజలి జంటగా తమిళంలో రూపొందించిన ‘వత్తికుచ్చి’ని తెలుగులో గోలీసోడాగా అనువదిస్తున్నారు. శ్రీ జె.వి.ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్‌రావు మార్టోరి అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనెలలోనే విడుదల చేయడానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, మురుగదాస్ శిష్యుడు కిన్‌స్లిన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిందని, అంజలి వైవిధ్యమైన పాత్రలో అద్భుతంగా నటించిందని తెలిపారు. యూత్ లవ్ ఫ్యామిలీ సెంటిమెంట్‌తోపాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రం సహజత్వంతో చిత్రీకరించిన విధానం ప్రేక్షకులకు నచ్చుతుందని, ఈ నెలాఖరుకు సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని అన్నారు. సంపత్, జయప్రకాష్, జగన్, సతీష్, అఖిలేష్‌కుమార్, శరణ్య పొన్‌వన్నన్, రాజశ్రీ, అంగనారాయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్, కెమెరా: ఆర్.బి.గురుదేవ్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్, ఎన్.బి.శ్రీకాంత్, నిర్మాత: వెంకట్‌రావు మార్టోరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.కిన్‌స్లిన్.