జగన్నాథానికి జోడీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సరైనోడు’ సూపర్‌హిట్ తరువాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం ‘డి.జె- దువ్వాడ జగన్నాథం’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభోత్సవ కార్యక్రమాలను జరుపుకుంది. ఇప్పుడు, ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నదానిపై ఇప్పటివరకు తీవ్రమైన చర్చ జరిగింది. మొదట పూజా హెగ్డేతో చర్చలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. ఆమె కాదని కాజల్ అగర్వాల్‌ను ఫిక్స్ చేశారని బలమైన ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెడుతూ బన్నీ సరసన పూజా హెగ్డే ఖాయమైనట్టు యూనిట్ సన్నిహిత వర్గాలనుండి వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక నిజమైతే బాలీవుడ్‌లో ‘మెహంజదారో’ సినిమాతో ఫ్లాప్ అందుకున్న పూజాకు తెలుగులో సక్సెస్‌కి మంచి ఛాన్స్ దక్కినట్టే. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి వంది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.

చిత్రం.. పూజాహెగ్డే