డబ్బింగ్‌లో డర్టీ గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిరిడీ సాయి క్రియేషన్స్ పతాకంపై ఖయ్యూం, నందినీ కపూర్ జంటగా అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ తాటి మనోహర్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘డర్టీ గేమ్’. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. పొలిటికల్, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించిన డర్టీగేమ్‌ను దర్శకుడు మంచి ప్లాన్‌తో తెరకెక్కించాడని, సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేసి, ఎడిటింగ్, డబ్బింగ్ జరుపుతున్నామని తెలిపారు. వర్తమాన రాజకీయ నేపథ్యంలో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా, పొలిటికల్, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను త్వరలో విడుదల చేసి, అక్టోబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. కోట శ్రీనివాసరావు, కోట శంకర్‌రావు, సురేష్, అశ్మిత, రమ్య, జబర్దస్త్ బృందం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాత: తాడి మనోహర్‌కుమార్, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అక్కపెద్ది వెంకటేశ్వరశర్మ.