మరో క్షణం కోసం ఎదురుచూపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ఈ ఏడాది విజయం సాధించి చిత్రాల్లో ‘క్షణం’ చిత్రం ఒకటి. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. అడివి శేష్, ఆదాశర్మ జంటగా నటించిన ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆదాశర్మకు ఈ సినిమా మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బిడ్డను కోల్పోయిన తల్లిగా ఆదా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా హిందీలో రీమేక్ చేయడానికి ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంతోపాటు తమిళంలో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్‌గా ఆదాశర్మనే తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపారని తెలిసింది. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆదాశర్మ, ఆ తరువాత రెండు మూడు సినిమాలు చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. గ్లామర్ గాళ్‌గా ఇమేజ్ తెచ్చుకున్నా కూడా లాభం లేకపోయింది. మొత్తానికి ఆమె ఫేట్‌ను క్షణం మార్చేసింది. మరి తమిళంలో కూడా ఆమె ఫేట్‌ను క్షణం మారుస్తుందేమో చూడాలి.