ఆ సాంగ్స్ చేయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ కాజల్ తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతూనే, మరోవైపు తమిళంలో కూడా తన హవా చాటుకుంటోంది. ఈమధ్యే బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈమెకు అక్కడ నిరాశే మిగిలింది. దాంతో సౌతే బెటర్ అని ఇక్కడే ప్రయత్నాలు సాగిస్తోంది. లేటెస్టుగా జనతాగ్యారేజ్ చిత్రంలో చేసిన ఐటెం సాంగ్‌కు మంచి క్రేజ్ దక్కింది. ముఖ్యంగా కాజల్ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారట. కాజల్ హీరోయిన్‌గా కంటే కూడా ఈ సాంగ్స్‌కే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఇపుడామెకు అన్నీ అలాంటి అవకాశాలే వస్తున్నాయట. తెలుగులోనుండే ఈ అవకాశాలు వస్తే ఫర్వాలేదు గాని తమిళంలో నుండి కూడా ఇలాంటి ఛాన్సులే రావడంతో షాకైందట కాజల్. ఏదో ఎన్టీఆర్, కొరటాల శివలతో వున్న ఫ్రెండ్‌షిప్‌తో ఈ సాంగ్ చేస్తే, ఇకపై అన్నీ అలాంటి అవకాశాలే రావడమేంటని అవాక్కైన కాజల్, ఇకపై ఈ తరహా సాంగ్స్ చేయనని ఫిక్స్ అయిందట. ఇప్పటికే చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. దాంతోపాటు తెలుగులో మరో చిత్రం, తమిళంలో మరో క్రేజీ చిత్రానికి ఓకె చెప్పింది. ఐటెం సాంగ్ చేయడంతో హీరోయిన్‌గా కాకుండా ఈ తరహా అవకాశాలు రావడంతో ఇకపై ఇలాంటి సాంగ్స్ ఎప్పుడూ చేయనని నిర్ణయం తీసుకుందట.