దసరాకు హైపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్, రాశీఖన్నా జంటగా రామ్‌ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూపొందిస్తున్న తాజా చిత్రం ‘హైపర్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని దసరా కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. జీబ్రాన్ అందించిన సంగీతంలో మొదటి పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, అలాగే విడుదలైన తొలి పాటకు కూడా రెస్పాన్స్ వస్తోందని తెలిపారు. మ్యూజికల్‌గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం వుందని, అన్ని కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయని, 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. సత్యరాజ్, రావు రమేశ్, మురశీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:జీబ్రాన్, కెమెరా:సమీర్‌రెడ్డి, ఎడిటింగ్:గౌతంరాజు, మాటలు:అబ్బూరి రవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.