కొత్త పంథాలో మన సినిమా నాగార్జున

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ద్విభాషా చిత్రం ‘మన ఊరి రామాయణం’. ప్రియమణి, సత్యదేవ్, పృధ్వీ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలోని పాటలు శుక్రవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఇళయరాజా సంగీతం అందించిన ఈ ఆడియో వేడుక కార్యక్రమంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున పాటల సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ‘ప్రతి మనిషిలోని రాముడు ఉంటాడు, రావణుడూ ఉంటాడు. ఎన్టీఆర్ చేసిన రావణాసురుడు రోల్ చూశాను, పుస్తకాల్లో చదివాను. అందుకే రావణుడంటే నాకిష్టం. ప్రకాష్‌రాజ్ ప్రతిక్షణం జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. తనలా వుండడానికి నేనెంతో ప్రయత్నించాను. కానీ కుదరలేదు. ప్రకాష్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కొత్తగా వుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. మంచి సినిమాలకు ఆదరణ లభిస్తోంది. తప్పకుండా ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలి’ అన్నారు. ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ- ‘దర్శకుడిగా ఈ కథను ఆలోచిస్తున్నపుడు ఇందులో నది లాంటి పాత్రను చేయడానికి ప్రియమణే కరెక్టు అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ రోల్ తనది. ముగ్గురు జీవితాల్లో మార్పును వేరే కోణంలో చూపించి వెళ్లిపోయే పాత్ర. ప్రియమణి లేకుండా కథను ఊహించుకోలేము. ఈ చిత్రానికి అద్భుతమైన టెక్నికల్ టీమ్ కుదిరింది. ముఖేష్ అద్భుతమైన విజువల్స్ అందించాడు. ఇళయరాజా గురించి చెప్పాల్సిన పనిలేదు. అభిషేక్ పిక్చర్స్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాను వారితో కలిసి విడుదల చేస్తున్నాము’ అన్నారు. పూరి జగన్నాధ్ మాట్లాడుతూ, ‘ప్రకాష్ ఎక్కడుంటే అక్కడ పచ్చగా వుంటుంది. తను ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడికి వెళ్లి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రియమణి చాలా మంచి నటి. మంచి సినిమా చేశాడు ప్రకాష్’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ, ‘దర్శకులందరూ ప్రకాష్‌గారితో సినిమాలు చేయాలనుకుంటారు. అలాంటి గొప్ప ఇమేజ్‌ను ఈ జనరేషన్‌లో పొందిన వ్యక్తి. విలక్షణమైన శైలిలో నటించే ఆయన దర్శకులనుండి నటుడిగా తనకు కావాల్సిన విషయాల్ని రాబట్టుకుంటాడు’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను, బొమ్మరిల్లు భాస్కర్, ప్రియమణి, సత్య తదితరులు పాల్గొన్నారు.