మహేశ్ హీరోయిన్ రకుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయికగా ఎంపికైంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో ఆమె పాల్గొంటోంది. అయితే, ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నయనతార నటించనున్నారని ఇటీవల టాలీవుడ్‌లో వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలో నిజంలేదని మురగదాస్ తన ట్విట్టర్ ద్వారా తేల్చిచెప్పారు. మహేష్‌బాబుతో తాను రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఒక్క రకుల్‌ప్రీత్‌సింగ్ మాత్రమే నటిస్తోందని, మరో పాత్ర ఏదీ లేదని ఆయన అన్నారు. పోలీసు అధికారిగా మహేష్‌బాబు నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నామని ఆయన అన్నారు.