బోయపాటితో చిరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి 151వ సినిమా దాదాపుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వుండబోతోందని టాలీవుడ్ భోగట్టా. రెండు మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి ఈ విషయాన్ని ఖరారు చేస్తున్నారు. బోయపాటి శ్రీను చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చడంతో ఈ సినిమాను అల్లు అరవింద్ రూపొందించనున్నారని సమాచారం. అడ్వాన్స్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఇదే సమయంలో పవన్‌కళ్యాణ్ సినిమాకు బోయపాటి శ్రీను గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. ఆ వివరాల్లోకి వెళితే దాసరి నారాయణరావు తన సంస్థ ద్వారా పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. అందుకోసం తన శిష్యులతో ఓ కథ కూడా తయారుచేశారట. ఈ కథను బోయపాటి తెరకెక్కిస్తే బాగుంటుందని ఆయనకు కబురుచేశారు. పవన్‌కు తగ్గ కథ ఒకటి తన దగ్గిరే ఉందని, అదైతే చేస్తానని బోయపాటి శ్రీను చెప్పడంతోనూ, పైగా చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తుందన్న ఆశతోనూ పవన్‌కళ్యాణ్ చిత్రానికి బోయపాటి శ్రీను నో చెప్పారట. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న 150వ సినిమా ‘ఖైదీ నెం.150’ పూర్తయ్యాకే 151వ చిత్రానికి సంబంధించిన వివరాలు బైటికి వస్తాయి.