8న వీలైతే ప్రేమిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నూతన నటీనటులతో విశాఖ థ్రిల్లర్ వెంకట్ దర్శకత్వంలో తేజ నిర్మిస్తోన్న మెసేజ్ ఓరియంటెడ్ ప్రేమకథా చిత్రం ‘వీలైతే ప్రేమిద్దాం’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం జనవరి 8న విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు వెంకట్ మాట్లాడుతూ.. ‘ఇది నాలుగు జంటల మధ్య నడిచే ప్రేమకథ. చక్కటి మెసేజ్‌తోపాటు అన్నివర్గాల ప్రేక్షకులకు వినోదాన్ని అందించే సకుటుంబ కథాచిత్రమిది. షకలక శంకర్ కామెడీ ఈ చిత్రంలో చాలా బాగా పండింది. స్వర్గీయ ‘ఆకాశ్’ అందించిన స్వరాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిఅయ్యాయి. నూతన సంవత్సర కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అన్నారు. పృథ్వి, తులసి, రాజు, శివ, యాంజలీన, శ్రావ్య, చంద్రకళ, నవీన్, పూర్ణిమ, శివన్నారాయణ, షకలక శంకర్, జబర్దస్త్ శ్రీను, రాజాశ్రీ్ధర్, ఎఫ్‌ఎమ్ బాబాయ్, గోపరాజు రమణలతోపాటు విశాఖ నగరానికి చెందిన స్థానిక కళాకారులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌పల్లా, సంగీతం: ఆకాశ్ (లేటు), డాన్స్: లుక్స్ రాజశేఖర్, శ్యామ్, ఆర్ట్: ఎస్.ఉత్తమకుమార్, చీఫ్ కోడైరెక్టర్: సురేష్. ఆర్, దర్శకత్వ పర్యవేక్షణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మూర్తి ఆడారి, సహ నిర్మాత: బి.మంగమ్మ, ఎ.రామకృష్ణ, నిర్మాత: తేజ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశాఖ థ్రిల్లర్ వెంకట్.