కాజల్ ప్రేమ ఎంతవరకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి.కె. దర్శకత్వంలో జీవా, కాజల్ అగర్వాల్ జంటగా తమిళంలో రూపొందించిన చిత్రానికి తెలుగులో ‘ఎంత వరకు ఈ ప్రేమ’ అన్న పేరును ఖరారు చేశారు. డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ తెలుగులో అనువదిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. కాజల్ అగర్వాల్ తమిళంలో నటించిన ఈ చిత్రంపై అక్కడ భారీ అంచనాలు నెలకొన్నాయని, తెలుగులో కథనుబట్టి ఎంత వరకు ఈ ప్రేమ అన్న పేరును నిర్ణయించామని, వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. ప్రేమించినప్పుడు వెనకా ముందు ఆలోచించుకునే అవకాశం ఉండదని, ప్రేమికుడికోసం ప్రేమికురాలు ఎంతవరకైనా తెగించి పోరాడుతుందని, అటువంటి ఓ కథనాన్ని తీసుకుని రూపొందించిన ఈ చిత్రం లవ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని, జీవా, కాజల్ క్రేజీ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని దర్శకుడు డి.కె. తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. బాబీసింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, కెమెరా: అభినందన్ రామానుజం, సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డి.కె.