గుండెల్లో వైశాఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరీష్, అవంతిక జంటగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై జయ బి. దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు రూపొందిస్తున్న చిత్రం వైశాఖం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు జయ బి. మాట్లాడుతూ ప్రతి పాత్ర సినిమాలో కథకు ప్రధానంగా సాగుతుందని, పాటలన్నీ విజువల్ వండర్‌గా రూపొందాయని తెలిపారు. కజకిస్థాన్‌లో చిత్రీకరించిన పాటలన్నీ ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తాయని, వసంత్ అందించిన బాణీలన్నీ మళ్లీ మళ్లీ వినాలనేలా ఉన్నాయని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేశామని, వైశాఖం అంటేనే గుండెల్లో ఓ అందమైన అనుభూతి కలుగుతుందని, అలాంటి చక్కని భావాలను పొదిగి పుట్టుకున్న వైశాఖం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆమె తెలిపారు. అక్టోబర్‌లో అన్ని కార్యక్రమాలు పూర్తిచేస్తామని, లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటుగా మెసేజ్ ఉన్న సినిమాగా రూపొందించిన ఈ చిత్రాన్ని తమిళం, తెలుగులో కూడా విడుదల చేయమని అడుగుతున్నారని, కొత్త కథతో రూపొందించిన ఈ చిత్రం విడుదలయ్యాక సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందన్న నమ్మకం వుందని నిర్మాత బి.ఎ.రాజు అన్నారు.