జిల్ జోడీతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యే గోపీచంద్ హీరోగా వచ్చిన ‘జిల్’ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్‌గా పెద్దగా వర్కవుట్ కాకపోయినప్పటికీ ఈ సినిమాలో గోపీచంద్ చాలా కొత్తగా కన్పించాడని అన్నారు. ప్రస్తుతం ఆయన ‘సౌఖ్యం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అప్పట్లో స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన ఎ.ఎమ్.రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకుడిగా ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో పరిచయమయ్యాడు. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని ‘ఉలాలా’ చిత్రాన్ని రూపొందించాడు. ఇపుడు మళ్లీ గోపీచంద్‌తో ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే గోపీచంద్‌తో చర్చలు జరుపుతున్నాడని తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రాశీఖన్నా నటిస్తోందని సమాచారం. మొత్తానికి జిల్ జోడీ మరో సినిమాకు సిద్ధవౌతున్నారు.