పైడి జయరాజు ఘనతను చాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తెలంగాణ తొలి సినిమా హీరో, నటుడు, నిర్మాత, దర్శకుడు పైడి జయరాజ్ 107వ జయంతి వేడుకలు బుధవారం ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ- తెలంగాణలో మొదటి తరం నటుడు పైడి జయరాజ్ ఆ రోజుల్లోనే ఆయన ముంబైకి వెళ్లి అక్కడ హీరోగా ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు వినిపించడం లేదు. ఆయన గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా వుంది. నిజానికి ఆయన పుట్టినరోజు వేడుకలను ఫిలిం ఛాంబర్ చేయాలి. కానీ వారు తెలంగాణ వాళ్ళను పట్టించుకోరు. వాళ్ళకు వాళ్ళ వర్గంవాళ్ళకు లేదా వాళ్ళ ప్రాంతంవారిపట్ల మాత్రమే ప్రేమ వుంటుంది. తెలంగాణ వచ్చి ఇన్ని రోజులు అయినా కూడా ఇంకా తెలుగు సినిమాలో తెలంగాణ వారిని చిన్నచూపు చూస్తున్నారన్నారు. దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ- ఈ రోజు మనం పైడి జయరాజ్ పుట్టినరోజు కానీ, ఇది ఆయన వర్థంతి రోజని చెప్పాలి. నిజాం కాలంలోనే తెలంగాణలో మనుషులు ఎలా బతకాలో అని ఆలోచిస్తున్న రోజుల్లోనే ముంబై వెళ్లి అక్కడ హీరోగా నిలబడ్డాడు ఓ తెలంగాణ వ్యక్తి. ఆయన చరిత్రను ఇక్కడ తెలుగు పరిశ్రమవారు పట్టించుకోవడంలేదు. ఆయన చరిత్ర భావితరాలకు తెలియాలి. ఫిలింనగర్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. దానికోసం అందరం ప్రయత్నం చేద్దామని అన్నారు.