జర్నీలో గీతావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణేష్, మంజరి, మాళవిక ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘జర్నీ-2’. జయలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై చిగులూరి గంగాధరరావుచౌదరి నిర్మిస్తున్నారు. ఎస్.నారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు ఆడియో సీడీలను విడుదల చేసి తొలి సీడీని నిర్మాత బి.ఎ.రాజుకు అందించారు. ఈ సందర్భంగా, నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ జర్నీ ఎంత పెద్దహిట్ అయ్యిందో మనకు తెలిందేనని, కన్నడలో ‘ముంగారుమలై’ చిత్రంలో నటించిన గణేష్ కన్నడలో నటించిన ‘ముంజా’ అనే చిత్రాన్ని తెలుగులో ఇప్పుడు ‘జర్నీ-2’ అనే పేరుతో సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నారని, కన్నడలో పెద్ద హిట్ అయిన ఈ చిత్రం తెలుగులోకూడా పెద్ద హిట్‌కావాలని కోరుకుంటున్నానని అన్నారు. పసుపులేటి రామారావు మాట్లాడుతూ ‘కన్నడలో గణేష్ నటించిన ముంజా పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు చిగులూరి గంగాధరరావుచౌదరిగారు తెలుగులో ఆ చిత్రాన్ని జర్నీ-2 పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద విజయాన్ని సాధించి దర్శక నిర్మాతలకు, యూనిట్ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’అన్నారు. వినాయకరావు మాట్లాడుతూ తెలుగులో విడుదలవుతున్న ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నానన్నారు. కృష్ణచైతన్య మాట్లాడుతూ ‘ఇందులో నాలుగు పాటలున్నాయి. అన్నీ బాగా కుదిరాయి. ఈనెల 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. గణేష్‌కి కన్నడలో పెద్ద మార్కెట్ ఉంది. ఆయన ఖాతాలో బ్లాక్‌బస్టర్ చిత్రాలున్నాయి. మంజరి తెలుగువారికి బాగా సుపరిచితురాలే. యువతకు కనెక్ట్‌అయ్యే సినిమా అవుతుంది’అని చెప్పారు. గంగాధరరావుచౌదరి మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 30న విడుదలౌతున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించి మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని నమ్మకంగా ఉన్నాం’అని అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెనె్నలకంటి, పాటలు: వెనె్నలకంటి, ఎడిటర్: ఈ.ఎం.నాగేశ్వరరావు, నిర్మాత: చిగులూరి గంగాధరరావుచౌదరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.నారాయణ.