డబ్బు కాదు... పాత్రే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మలయాళ భాషలో ‘ప్రేమమ్’ చిత్రం విడుదలై రెండేళ్లయింది. ఇప్పుడు మళ్లీ తెలుగులో రీమేక్‌లో అదే పాత్రలో నటించమంటే ఒప్పుకున్నా. ఎందుకంటే, మొదటి సినిమాలో నటించినదంతా
ఓ రకంగా మర్చిపోయాను. తెలుగులో చేసేటప్పుడు కూడా సరికొత్తగానే పాత్రను అర్థం చేసుకుని నటించాను. ఆ చిత్రంలో నా పాత్ర పేరు మేరీ అయితే, ఇక్కడ సుమ’’ అని కథానాయిక అనుపమా పరమేశ్వరన్ తెలిపారు.
నాగచైతన్య, శ్రుతిహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన తారాగణంగా సితార
ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చందూ మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ రూపొందించిన చిత్రం ‘ప్రేమమ్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 7న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా
చిత్ర విశేషాలను కథానాయిక తెలిపారు.

ఓ పిక్నిక్‌లా
ఈ సినిమా షూటింగ్ అంతా ఓ పిక్నిక్‌లా ఎంజాయ్ చేస్తూ పనిచేశాం. ఎందుకంటే ఉన్నదంతా యువతే. ‘ప్రేమమ్’ తెలుగు చిత్రానికి కూడా అంతా యంగ్ టీమ్ కుదరడంతో భాష తెలియకపోయినా, కొంచెం ఇబ్బంది కలిగినా హ్యాపీగా చేశాం. ఇక్కడ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేశాం. మలయాళంలోకన్నా తెలుగు చిత్రంలోనే నా పాత్ర పెద్దదిగా రూపొందింది.
హీరో దర్శకుడు
సినిమా చేస్తున్నంతవరకూ హీరో నాగచైతన్య డౌన్ టు ఎర్త్ పర్సన్‌లా కలివిడిగా వున్నారు. సినిమా ప్రారంభించినపుడు కొంచెం టెన్షన్ పడినా ఆ తరువాత అతను ఫ్రెండ్లీగా కలిసిపోయాడు. చందూ మొండేటి కూడా కూల్ కామ్ గోయింగ్ పర్సన్. ఏ పరిస్థితుల్లోనైనా తను అనుకున్నది చక్కగా హాండిల్ చేస్తూ షూటింగ్ చేశాడు. సెట్ అంతా కంఫర్ట్‌గా ఉండేలా చూసుకున్నాడు.
కారణం లేదు
చేసిన పాత్రనే మళ్లీ ఈ చిత్రంలో చేయనని చెప్పడానికి కారణం ఏదీ కన్పించలేదు. ఈ సినిమాను నేను బాగా ప్రేమించాను. తెలుగు రీమేక్ చేస్తున్నామని నన్ను వచ్చి కలిసినపుడు నటీనటుల గురించి తెలుసుకున్నాను. మంచి టీమ్ కావడంతో వద్దనలేకపోయాను. రెండు వర్షన్స్‌లో నా పాత్ర ఎటువంటి మార్పులు పొందలేదు. అయితే తెలుగు వర్షన్‌ను నేను ఇంకా చూడలేదు.
నెగెటివ్ షేడ్స్‌తో
నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలు చేయడానికి ఇష్టపడతాను.‘అ ఆ’ సినిమాలో నేను నటించడానికి అదే ముఖ్యమైన కారణం. అందుకే విలక్షణంగా వుండే పాత్రలు చేయడానికి చూస్తున్నాను. మంచి అవకాశాలు వస్తున్నాయి. నేను నటించాలనుకున్న పాత్రతో ఏదో ప్రాముఖ్యం వుండాలని కోరుకుంటాను. డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వను.
ప్రేమలో పడలేదు
రోజూ ఎంతోమంది మన పనిలో ఎదురవుతుంటారు. కొంతమందితో క్రషెస్ వుంటాయి. అలాగే నాకూ క్రష్ వుంది. కానీ నేను ఇంతవరకూ ఎవరితో ప్రేమలో పడలేదు. అయినా వాటి గురించి ఆలోచించే సమయమూ లేదు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్
తెలుగులో శతమానం భవతి అనే మూడో చిత్రంలో నటిస్తున్నాను. మలయాళంలో కూడా మరో చిత్రంలో చేస్తున్నాను. ఓ తమిళ్ సినిమా పూర్తయింది. అది దీపావళికి విడుదల కానుంది.

-శ్రీ