క్రేజీ కాంబినేషన్?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జనతాగ్యారేజ్ అందించిన కిక్‌తో జూ.ఎన్టీఆర్ వరుసగా చిత్రాలను చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నాడు. రాఘవేంద్రరావు ప్రస్తుతం నాగార్జునతో ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తన శిష్యుడు బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళిలాగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ఓ చిత్రం రూపొందించడానికి రాఘవేంద్రరావు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం పౌరాణికం అవుతుందేమో అని టాలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్ హీరోగా నటించనున్నారట. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఏ వార్తా ఇంతవరకూ బయటకురాలేదు. త్వరలో విశేషాలు తెలుస్తాయేమో చూడాలి!