ఈ ప్రేమ ఎంతవరకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవా, కాజల్ అగర్వాల్ జంటగా డి.కె. దర్శకత్వంలో డి.వెంకటేష్ అందిస్తున్న చిత్రం ‘ఎంతవరకు ఈ ప్రేమ’. తమిళంలో ‘కవళైవేండామ్’గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా మాటలు, పాటలు అందించిన వెనె్నలకంటి మాట్లాడుతూ- ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతి సీన్ పొయిట్‌గా సాగుతుందని, అభినందన్ రామానుజమ్ అందించిన కెమెరా హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మనసుకు హత్తుకునేలా ఈ చిత్రం వుంటుందని ఆయన అన్నారు. జీవా, కాజల్ నటన హైలెట్‌గా సాగే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే నెల మొదటివారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత డి.వెంకటేష్ తెలిపారు.