అదిరేటి డ్రెస్సు మేమేస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాంతీయ భాషా చిత్రాల్లో ఐటెం డాన్సర్లతోపాటుగా కథానాయికలు కూడా అదిరేటి డ్రెస్సులు వేసేసి ఐటెం పాటల్లో నటించేస్తున్నారు. ప్రేక్షకులకు హీరోపక్కన నృత్యం చేసేది హీరోయిన్నా లేక ఐటెం గర్లా అన్న అనుమానం అన్నిచోట్లా వస్తోంది. అయితే, కొన్ని భాషా చిత్రాలు వీటికి దూరం. సమాంతర చిత్రాలను రూపొందించుకుంటూ వెళ్ళే బెంగాలీ, మణిపురి, మరాఠి భాష చలన చిత్రాలలో ఇటువంటి ‘ఐటెం’ల వెంపర్లాట ఎక్కడా కనపడవు, వినపడవు. వీరందరూ ఇలా వుంటే, బాలీవుడ్‌లో కూడా హీరోయిన్లు ఐటెం పాటల దిశగా వెళుతూ అదిరేటి డ్రెస్సులు వేసేస్తూ హిందీ సినిమా మార్కెట్ విలువను పెంచేస్తున్నారు. ఓరకంగా మంచి చిత్రాల అభిమానుల దృష్టిలో విలువను తగ్గించేస్తున్నారు. బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌కు ఎగిరిన గ్లామర్ భామ ప్రియాంక చోప్రా తాజాగా ఐటెం పాటలలోనూ, హీరోయిన్‌గానూ సంచలనాలు రేపుతోంది. అటు గ్లామర్ పాత్రలు, ఇటు నటనకు ప్రాధాన్యత వున్న పాత్రలలో నటిస్తున్నా, ఇంతవరకూ ఏ సినిమాలో చేయనంతగా రొమాంటిక్ సన్నివేశాలు నటిస్తూ షాక్‌లమీద షాక్‌లనిస్తోంది. ప్రముఖ అమెరికన్ టీవీ సీరీస్ క్వాంటికో ఫస్ట్ సీజన్ సూపర్‌హిట్ అవ్వడంతో దానికి రెండో సీజన్‌గా కూడా ప్రియాంకతోనే రూపొందించారు. మొదటి భాగంలో కంటే రెండో భాగంలో ప్రియాంకా చోప్రా రెచ్చిపోయి నటించింది. ఇప్పటికే ఈ ఓకు సంబంధించిన ప్రచార చిత్రం విడుదలై నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. యూట్యూబ్‌లో ప్రియాంక హాట్‌షూట్ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారంతా షాక్‌కు గురవుతున్నారట. ప్రియాంక చోప్రా ఇంత స్థాయిలో రెచ్చిపోయి నటించగలదా అని. ముఖ్యంగా నెట్ సెర్చ్‌లో ప్రియాంక హాట్ వీడియో అంటూ కొడితే అలవోకగా ప్రత్యక్షమవుతోందట ప్రియాంక. ఇప్పటికే కారులో శృంగారం చేస్తూ సెగలు రేపిన ఈ అమ్మడు బెడ్‌రూమ్ సన్నివేశాల్లో విజృంభించి నటించింది. హాలీవుడ్‌లో పాగా వేయాలనే తపనతో ప్రియాంక ఇలా కావాలనే రెచ్చిపోయి నటించిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ప్రియాంక హాట్ బ్యూటీగా మన్ననలు అందుకుంటోంది.
బికినీలో లారిసా
బాలీవుడ్ మరో సుందరాంగి లారిసా బొనేసి, తానేం తక్కువ తినలేదంటూ బికినీ ఫోజులిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తన సాటివాళ్ళతో సమానంగా కాకుండా మరింత ఎత్తులో వుండాలని లారిసా బికినీల్లో మాత్రమే దర్శనమిస్తోంది అందరికీ. తెలుగులో సాయిధరమ్‌తేజ్ హీరోగా వచ్చిన ‘తిక్క’ సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. మర్చిపోయే అందమా ఆమెది అని కుర్రకారు సెటైర్లు వేస్తున్నారు. అయితే ‘తిక్క’పై ఎన్నో ఆశలు పెట్టుకున్న లారిసా ఆ సినిమా ఫ్లాప్‌తో బాలీవుడ్‌కు ఎగిరిపోయింది. అందుకే, బీచ్‌లో బికినీతో అందాలు ఆరబోయడానికి సిద్ధమైంది. ఈ అమ్మడి బికినీ అందాలు చూసినవారికి చూపుతిప్పుకోకుండా చేశాయంటే నమ్మాల్సిందే.
ఐష్ వైఖరీ మారింది
పెళ్ళై ఓ బిడ్డకు తల్లయ్యాక ఐశ్వర్యారాయ్ కూడా తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందడానికి డోస్ మరికాస్త పెంచి నటిస్తోందట. చాలాకాలం గ్యాప్ తీసుకుని మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన ఐష్ చేసిన రెండు చిత్రాలు ఆమెలోని నటిని నిరూపించాయి తప్ప అటు గ్లామర్ పరంగా పెద్ద మార్పు కన్పించలేదు. దాంతో ఇక లాభం లేదనుకుందో ఏమో అందాలు ఆరబోయడానికి సిద్ధమైంది. తాజాగా ఆమె నటిస్తున్న ఓ చిత్రంలో హీరోతో రొమాంటిక్ సన్నివేశాలు చేస్తూ దుమ్ము రేపుతోంది. పెళ్ళైన హీరోయిన్‌గా గుర్తింపు వున్నా ఐశ్వర్యరాయ్ మాత్రం కుర్ర హీరోయిన్‌లకు ధీటుగా అటు గ్లామర్ సన్నివేశాల్లోనూ ఇటు రొమాంటిక్ సీన్లలోనూ నటిస్తూ అందరికీ షాక్ ఇస్తోంది. కావాలనే ఆమె ఇలా రెచ్చిపోయి నటిస్తోందని యూనిట్ వర్గాలు చెప్పాయి. ఐశ్వర్యరాయ్-రణబీర్‌కపూర్ జంటగా నటిస్తున్న ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలో మొదట స్క్రిప్ట్ ప్రకారం గ్లామర్ షోలు, రొమాంటిక్ సీన్లు లేవట. అయితే తన పాత్ర గురించి స్టడీ చేసిన ఐష్ ఇదంతా సింపుల్‌గా వుందని, కాస్త మసాలా దట్టించమని దర్శకుడికి చెప్పిందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్లు చూశాక ప్రేక్షకులు అవాక్కయ్యారట. మొత్తానికి ఈ సినిమా విడుదలైతే ఐశ్వర్యరాయ్‌కు అవకాశాలు మరిన్ని వస్తాయని బాలీవుడ్ భావిస్తోంది. మొత్తానికి అటు అవకాశాల కోసంగాని, ఇటు జారిపోతున్న క్రేజ్‌ను నిలుపుకోవడానికి గాని హీరోయిన్లు నానాబాధలు పడటం బాలీవుడ్ తెరపై కనిపిస్తున్న దృశ్యం. ఏదిఏమైనా ఎన్ని బికినీలు వేసి స్కిన్ షో చేసినా సదరు చిత్రంలో కథ లేనిదే సినిమా చూడరని ఎన్నోసార్లు నిరూపణ అయినా హీరోయిన్లు మాత్రం తమ తళుకులతోనే సినిమా గట్టెక్కుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలని మంచి సినిమా అభిమానులు కోరుకుంటున్నారు.
-యు