ముస్తాబవుతున్న కార్తీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుష్, రీచా గంగోపాధ్యాయ జంటగా ఓం శివగంగ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై శ్రీరాఘవ దర్శకత్వంలో కె.బాబూరావు, కె.మల్లికార్జున్ రూపొందించిన చిత్రం ‘మిస్టర్ కార్తీక్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- తమిళంలో మంచి విజయం సాధించిన ‘మయక్కమ్ ఎన్నా’ చిత్రాన్ని తెలుగు ‘మిస్టర్ కార్తీక్’ పేరుతో అనువదించామని, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని తెలిపారు. ధనుష్ నటన హైలెట్‌గా సాగే ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామన్నారు. కథానాయకుడికి ఎదురైన సమస్యలను పరిష్కరించుకుంటూ తన జీవితంలో ఎలా విజయం సాధించాడు అనే కథనంతో సాగే ఈ చిత్రంలో ప్రేమకథ కూడా సమాంతరంగా సాగుతూ ప్రేక్షకులకు నచ్చుతుందని వారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:జి.వి.ప్రకాష్‌కుమార్, పాటలు:శశాంక్ వెనె్నలకంటి, మాటలు:వెంకట్ మల్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీరాఘవ.