లక్ష్మీబాంబ్ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచులక్ష్మి ముఖ్యపాత్రలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై వేళ్ళ వౌనికా చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మిస్తున్న ‘లక్ష్మీబాంబ్’ పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సీడీని విడుదల చేశారు. మోహన్‌బాబు, సునీల్ కశ్యప్, మంచు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దాసరి నారాయణరావు మాట్లాడుతూ- ‘లక్ష్మీ తప్ప నాకు ఈ సినిమా గురించి ఏమీ తెలియదు. పాటలు విన్నాక మంచి సినిమా తీయాలన్న ప్రయత్నంతో టీమ్ ఉందని అర్థమైంది. కార్తికేయ గోపాలకృష్ణ మంచి స్పిరిట్ వున్న కుర్రాడు. లక్ష్మీ గెటప్, సినిమా సంగీతం విషయంలో తీసుకున్న కృషి అభినందనీయం. సునీల్ చాలా మంచి సంగీతాన్ని అందించాడు. లక్ష్మీ నటిగానే కాకుండా అన్ని యాక్టివిటీస్‌లో ముందుంటుంది. ఈ ట్రైలర్ చూసిన తరువాత రాములమ్మ తరహాలో ఆమెతో సినిమా చేయాలని వుంది అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ- ‘సినిమా రంగంలో చిన్నా పెద్దవారు ఎవరూ వుండరు. స్వర్గం నరకం చేసే సమయంలో నేను కూడా చిన్నవాడినే. ఈరోజు చిన్నవారే, రేపు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మంచి సినిమా చేశాడు. ఈ సినిమాలో లక్ష్మి అద్భుతంగా నటించిందని తెలిసింది. తప్పకుండా ఈ యూనిట్ అందిరికీ ఘనవిజయం అందించాలి’ అన్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ- ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎప్పుడైతే కథ విని ఓకే చేశానో అప్పటినుంచి అదే నమ్మకంతో వున్నాం. ఈ సినిమాలో నేను డాన్సులు కూడా చేశాను’ అన్నారు. దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ- ‘మంచు లక్ష్మిలోని మరో కోణాన్ని చూస్తారు. దీపావళికి చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు.