కంటెంట్‌ను నమ్మి సినిమాలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాతగా తెలుగు పరిశ్రమలో 9 సంవత్సరాల అనుభవం వున్నా కూడా కంటెంట్‌ను నమ్మి సినిమాలు తీస్తేనే కరెక్ట్.. అని అంటున్నాడు నిర్మాత రాజ్ కందుకూరి. విజయ్ దేవరకొండ, రీతువర్మ జంటగా తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో నిర్మించిన ‘పెళ్లిచూపులు’ చిత్రం ఘనవిజయం సాధించి వంద రోజులవైపు దూసుకుపోతోంది. శనివారం రాజ్ కందుకూరి జన్మదినం సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు..
పెళ్లిచూపులు చిత్రం 75 రోజులు పూర్తిచేసుకుని వందరోజుల దిశగా అడుగుపెడుతున్నందుకు ఆనందంగా వుంది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా విజయంలో నిర్మాత సురేష్‌బాబు సహకారం మరువలేనిది. ఇంత చిన్న సినిమాను ఆయన జనాల్లోకి తీసుకెళ్లిన విధానం వల్లే ఇంతటి ఘనవిజయం దక్కింది. ఏ సినిమాకైనా కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రతిసారి రుజువు చేస్తూనే వున్నారు. అలాగే ఈ సినిమాని కూడా ఆదరించారు. గౌతమబుద్ధ సినిమాతో తెలుగు రంగంలోకి అడుగుపెట్టాను. తొలి చిత్రానికే నంది అవార్డు, దలైలామా అవార్డు, వంశీ అకాడమీ అవార్డులు వచ్చాయి. నా తొమ్మిదేళ్ల సినీ జర్నీలో పెళ్లిచూపులు తొమ్మిదవ చిత్రం. ముఖ్యంగా నా కెరీర్‌కు మైలురాయిలాంటిది. ఈ సినిమా తరువాత నాకు బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నా. చాలామంది హీరోనుబట్టి బడ్జెట్ వేసుకుని సినిమాలు చేస్తున్నారు. సినిమాకు హీరో బడ్జెట్ ముఖ్యమే కానీ కంటెంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం. మంచి కథ తయారుచేసుకొని దానికి తగ్గ హీరోతో సినిమా చేస్తే తప్పకుండా విజయం వరిస్తుందని తెలిసివచ్చింది. నా ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్‌లో రెండు కోట్ల బడ్జెట్‌కు లోబడి కొత్తవారితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ బ్యానర్‌లో తప్పకుండా భవిష్యత్తులో కొత్తవారిని పరిచయం చేస్తా. ఇక పెళ్లిచూపులు హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నా. దాంతోపాటు దర్శకుడు తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో ‘సైన్మా’ పేరుతో మరో చిత్రం చేస్తున్నా. మరో కొత్త దర్శకుడితో మరో చిత్రం ఉంటుంది. విజయ్ దేవరకొండ సినిమా నవంబర్‌లో ప్రారంభం అవుతుంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తా.