కుటుంబ ప్రేమకథతో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్‌రామ్, శివశక్తి సచిదేవ్ జంటగా జొనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వి.ఆర్. చలనచిత్రాలు బ్యానర్‌పై వి.ఇ.వి.కె.డి.ఎస్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ క్లాప్‌నివ్వగా, నటుడు నరేష్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సుకుమార్ మాట్లాడుతూ- ‘దర్శకుడు జొనాథన్‌పై రామ్‌గోపాల్ వర్మ ప్రభావం ఎక్కువగా వుంది. వైవిధ్యమైన ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా రతన్ పేరును నేనే సూచించాను. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’ అన్నారు.
నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ- సుకుమార్‌తో తనకు 25 ఏళ్ళ అనుబంధమని, చక్కటి కథతో ఇంటిల్లిపాదికి నచ్చే విధంగా అన్నిరకాల అంశాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. దర్శకుడు జొనాథన్ మాట్లాడుతూ- సుకుమార్ పెట్టిన పరీక్షలన్నీ పాసైన తర్వాతే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. ముఖ్యంగా రసూల్ ఎల్లోర్ కెమెరామెన్‌గా పనిచేయడం ఆనందంగా వుంది. కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందే చక్కటి ప్రేమకథా చిత్రమిది. గులాబి, గీతాంజలి తరహాలో వుంటుంది. ఈనెలాఖరున చిత్రీకరణ ప్రారంభించి రెండు షెడ్యూల్స్‌లో పూర్తిచేస్తాం అన్నారు. హీరో హీరోయిన్లు మాట్లాడుతూ- మంచి టీమ్‌తో ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా వుందని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:రసూల్ ఎల్లోర్, ఆర్ట్:రామకృష్ణ, సంగీతం:రతన్, డైలాక్స్:విస్సా శ్రీకాంత్ నాయుడు, నిర్మాత:ప్రసాద్, దర్శకత్వం:జొనాథన్ ఎడ్వర్డ్.