కలిసి నవ్వుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి హీరోగా పూర్ణ హీరోయిన్‌గా శివరాజ్ ఫిలింస్ పతాకంపై శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. ఈ సినిమాలోని ట్రైలర్‌లు ఇటీవలే విడుదలయ్యాయి. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- సినిమా రష్ చూసి స్పెల్‌బౌండ్ అయ్యానని, శివరాజ్ అద్భుతంగా తెరకెక్కించాడని అన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ- నా కెరీర్‌కు ఈ చిత్రం ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ అవుతుందని తెలిపారు. హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ- చాలా మంచి పాత్ర వేసే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాతో నన్ను అందరూ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ పూర్ణ అంటారని తెలిపారు. దర్శక నిర్మాత శివరాజ్ మాట్లాడుతూ- సుకుమార్ ప్రేరణతో ఈ చిత్రాన్ని రూపొందించాను. ముఖ్యంగా ఒకసారి ఇటుచూడవే పాటకు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ:ఎ.వి.ఎస్.రాజు, రవివర్మ, కెమెరా:నగేష్, ఎడిటింగ్:వెంకట్, నిర్మాత, దర్శకత్వం:శివరాజ్ కనుమూరి.