సైన్స్ ఫిక్షన్ కథలంటే ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, శ్రుతిహాసన్, అనుపమా పరమేశ్వరన్ ముఖ్యపాత్రల్లో చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమమ్’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు చందూ మొండేటి చెప్పిన విశేషాలు..
ఆనందంగా ఉంది
ముందు అనుకున్నట్టుగానే సినిమా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ విజయాన్ని చూసి నాగార్జున చాలా ఆనందంగా ఫీలయ్యారు. చాలారోజుల క్రితమే సినిమా చూసి బాగుందని ప్రోత్సహించారు. చైతన్య కూడా మూడు వేరియేషన్స్ వున్న పాత్రల్లో చక్కగా నటించారు.
ముందు కొత్త కథే అనుకున్నా
చైతు దగ్గరికి కొత్త సబ్జెక్టుతో సినిమా చేయాలని అనుకున్నాము. కానీ ప్రేమమ్ రిలీజ్ అయిన తరువాత దాన్ని చూసి బాగుందని చెప్పడంతో ఆ సినిమానే రీమేక్ చేద్దామని అడిగారు. కాబట్టి నేను కూడా సరే అన్నాను.
అందుకే టైటిల్ మార్చలేదు
మొదట ఈ సినిమాకి మజ్ను అనే టైటిల్ పెడదామనుకున్నాం. చాలామంది ఆ టైటిల్ పెడితే శాడ్ స్టోరీ అవుతుందని అభిప్రాయపడడంతో అదే టైటిల్‌ను పెట్టేశాం. చాలామంది ప్రేమమ్ అనే మలయాళ టైటిల్ ఎందుకు పెట్టారని అడిగారు. నిజానికి సంస్కృతంలో ప్రేమకు అసలు పదం ప్రేమమ్ కాబట్టి అది ఏ భాషకైనా సరిపోతుందని పెట్టాం.
ముగ్గురూ ముగ్గురే
ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. ఇందులో ఒక పాత్రకోసం కావాలనే శ్రుతిహాసన్‌ను ఎంపిక చేశాం. ఈ సినిమా చేయమని అడిగినపుడు వెంటనే ఓకె చెప్పారు. సినిమాలో ఆమె మేకప్ కూడా వేసుకోకుండా నాచురల్‌గా చేశారు. దాంతోపాటు అనుపమ, మడొన్నా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు.
సైన్స్ ఫిక్షన్ ఇష్టం
నిజానికి రీమేక్ సినిమాలు చేయాలని లేదు కానీ, నాకు నచ్చే కథ దొరికితే చేస్తా. అలాగే నాకు సైన్స్ ఫిక్షన్ కథలంటే చాలా ఇష్టం. నా దగ్గర అలాంటి కథలే ఎక్కువగా వున్నాయి. ఆ జోనర్‌లోనే మంచి సినిమాలు తీయాలని ఉంది.
తదుపరి చిత్రాలు
ఐ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాము. దాంతోపాటు ఇదే బ్యానర్‌లో మరొకటి, దిల్‌రాజుతో మరో సినిమా అనుకుంటున్నాము. అంతేకాకుండా వెంకటేష్‌కు కూడా ఓ కథ చెప్పాను. వచ్చే ఏడాదిలో ఖచ్చితంగా ఓ చిత్రం విడుదలవుతుంది.

-యు