వెండితెరపై కోటీశ్వరుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్‌చంద్ర, శృతిసోధి జంటగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ రూపొందించిన చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా వందశాతం ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుందని దర్శకుడు ఈ చిత్రాన్ని వైవిధ్యంగా తీశారని తెలిపారు. ఈ నెల 19న ఆడియోను విడుదల చేసి చివరివారంలోగానీ, నవంబర్ మొదటివారంలోగానీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే కార్యక్రమం మనకు తెలిసిందేనని, అదే పేరుతో రూపొందించిన ఈ చిత్రం వైవిధ్యభరితంగా వుంటుందని దర్శకుడు సత్తిబాబు అన్నారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో పృధ్వీ, సలోని, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్, పిల్లాప్రసాద్, గిరి, సన, విద్యుల్లేఖారామన్, మీనా, నేహాంత్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:శ్రీవసంత్, కెమెరా:బాల్‌రెడ్డి.పి, కథ, మాటలు:నాగేంద్రకుమార్ వేపూరి, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, నిర్మాత:కె.కె.రాధామోహన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఇ.సత్తిబాబు.