చిలుకూరు బాలాజీకి సెన్సార్‌బోర్డు ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయికుమార్, సుమన్ ప్రధాన తారాగణంగా టీమ్ ఇండియా ప్రొడక్షన్స్ ప్రై. లి. పతాకంపై అల్లాణి శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘చిలుకూరి బాలాజీ’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. యు సర్ట్ఫికెట్ లభించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ- సెన్సార్ అధికారుల ప్రశంసలు తమకు ధైర్యాన్ని ఇచ్చాయని, ఇటీవల చిన్నజీయర్ స్వామి విడుదల చేసిన ఆడియోకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోందని, ఈమధ్యకాలంలో వచ్చిన భక్తి సినిమా పాటల్లో ఇవే బాగా ఉన్నాయని పలువురు అభినందిస్తున్నారని తెలిపారు.
అన్ని కార్యక్రమాలు పూర్తిచేసిన ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, నేటి యువతరానికి వీసాలు ఇచ్చే బాలాజీగా ఆశీర్వాదాలందిస్తూ ఆరాధింపబడుతున్న చిలుకూరి బాలాజీ ఆలయ పురాణాన్ని ప్రాశస్త్యాన్ని తెలుపుతూ ఓ దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించామని ఆయన అన్నారు. ఎస్.బి.బలాసుబ్రహ్మణ్యం, భానుశ్రీ మెహ్రా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:అర్జున్, రచన, నిర్మాణం, దర్శకత్వం:అల్లాణి శ్రీధర్.