విశాల్‌తో వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో టాప్ హీరోయిన్ రేసులో రకుల్ ప్రీత్‌సింగ్ ముందుండి దూసుకుపోతోంది. సూపర్‌స్టార్ మహేష్‌తో ఓ సినిమా, రామ్‌చరణ్‌తో ధ్రువ అనే సినిమా, సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమా ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఖాళీలేకుండా కష్టపడుతున్న ఈ భామ ఈమధ్యే తమిళంలో విశాల్ హీరోగా తెరకెక్కనున్న ‘తుప్పరివాలన్’ అనే సినిమాకు కూడా రకుల్ హీరోయిన్‌గా ఓకే అనేసింది. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో విశాల్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేసుకోలేకపోతున్నదట. దీంతో రకుల్ ‘తుప్పరివాలన్’ సినిమా నుంచి బయటకొచ్చేసినట్లేనని సమాచారం. ఒకపక్క తుప్పరివాలన్ టీమ్ కూడా ఇప్పటికే షూట్ మొదలుపెట్టేందుకు సిద్ధమైపోవడంతో రకుల్‌కు సినిమా నుంచి బయటకు రావడం తప్ప వేరే ఆప్షన్ దొరకలేదట. ప్రస్తుతం రకుల్ తప్పుకోవడంతో ఆ పాత్రకు వేరొక హీరోయిన్ వెతికే పనిలో విశాల్ టీమ్ పడిపోయింది.