పవన్‌కు జోడీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సినిమాల జోరు పెంచిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తోన్న 22వ సినిమా కాటమరాయుడు సెట్స్‌పై ఉండగానే, నిన్ననే 23వ సినిమా కూడా మొదలుపెట్టేశారు. ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఇప్పటికే దాదాపుగా పూర్తికాగా, టీమ్ క్యాస్టింగ్ ప్రక్రియ మొదలుపెట్టిందట. పవన్ సరసన హీరోయిన్‌గా నయనతారను సంప్రదించినట్లు తెలుస్తోంది. నయనతార కూడా ఈ సినిమాకు దాదాపుగా ఓకే చెప్పేశారట. అజిత్ హీరో మంచి విజయం సాధించిన ‘వేదాళం’కి రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎ.ఎం.రత్నం నిర్మాత. కాటమరాయుడు సినిమా పూర్తవ్వగానే పవన్ 23వ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. అదేవిధంగా పవన్, నయనతారతోపాటుగా సినిమాకు కీలకమైన మరో పాత్రలో ఓ యువ హీరోయిన్ నటించనున్నారని సమాచారం. మొత్తానికి నయనతార.. పవన్ సినిమాలో నటిస్తుండడం ఇప్పుడు
ఆసక్తిగా మారింది.

చిత్రం..నయనతార