కల ఫలించిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో సంచలన హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం తమిళంలో బిజీగా వుంది. వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న నయనతారకు ఇటీవలే విడుదలైన ‘మయూరి’ చిత్రం మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. అయితే ఎన్ని చిత్రాల్లో చేసినా కూడా నయనతారకు విక్రమ్ సరసన నటించాలనే కల ఉండేదట. ఆయనతో ఎప్పటికైనా నటిస్తానని అంటోంది ఆమె. లేటెస్టుగా ఈమెకు ఇలాంటి అవకాశమే దక్కింది. విక్రమ్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎండ్రదుకుళ్ల’ సినిమా ఇటీవల విడుదలై ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడంతో ఆయన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టారు. అరిమనంబి దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ‘మర్మమనిదన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో హీరోయిన్‌గా నయనతార ఓకె అయ్యిందట. మొత్తానికి ఈ సినిమాతో నయనతార కల తీరనుంది.